తెలంగాణ

‘మల్లన్న’కు తొలగనున్న విఘ్నాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 3: మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతున్న భూ సేకరణను త్వరగా ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భూములు ఇవ్వడానికి అనాసక్తి కనబర్చిన రైతులను ఒప్పించడంలో ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లై కూర్చుంది. ఉద్యమాలు, ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, అధికారులను అడ్డుకోవడం, భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులపై దాడులు, ఇళ్ల ధ్వంసం, పోలీసుల లాఠీచార్జీలు, గాల్లోకి కాల్పులు, రాష్ట్ర స్థాయి నేత లు రైతులకు బాసటగా నిలువడం లాంటి అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కల్పించుకుని గ్రామాల వారీ గా రైతులతో చర్చలు జరిపి ఒప్పించడంలో సఫలీకృతులయ్యా రు. అయినప్పటికీ తొగుట మండలం వేములగట్ గ్రామంలో మాత్రం రిలే నిరాహార దీక్షలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు సుముఖంగా ఉన్న గ్రామాల్లో భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయించడానికి కలెక్టర్ ఉపక్రమించారు. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లా సబ్ రిజిస్టార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు ఆగస్టు 20న ఐదుగురు సబ్ రిజిస్ట్రార్‌ను ఇవ్వాలని లేఖ రాసారు. అదేవిధంగా సెప్టెంబర్ 1న మరో నలుగురు సబ్ రిజిస్ట్రార్లు కావాలని కలెక్టర్ మరో లేఖ రాసారు. జిల్లా రిజిస్ట్రార్ రమేష్‌రెడ్డి కలెక్టర్ ఇచ్చిన లేఖలను కమిషనర్‌కు సిఫార్సు చేసారు. ఆ లేఖలను రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కమిషనర్ ప్రభుత్వానికి పంపించగా రెండింటినీ పరిశీలించిన ప్రభుత్వం జివో 401 ప్రకారంగా ఐదుగురిని, మరో జీవో 403 ప్రకారంగా నలుగురిని నియమించడానికి అనుమతిస్తూ విడుదల చేసింది. 401 జీవో ప్రకారంగా సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండి.గయాజోద్దీన్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సయ్యద్ నసీరోద్దీన్, గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సురేష్, మెదక్ సబ్ రిజిస్ట్రార్‌లో పనిచేస్తున్న ఎ.రఘుపతిని, సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సి.నటరాజ్‌లను తాత్కాలిక సబ్ రిజిస్ట్రార్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ రమేష్‌రెడ్డి వెల్లడించారు. జీవో 403 ప్రకారంగా మరో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు నిజామాబాద్ జిల్లా నుంచి వస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ అసిస్టెంట్లు ఎండి.ఆసిపోద్దీన్, ఎ.శ్రీ్ధర్, పి.విజయక్రిష్ణ, పి.వాసుకి రానున్నట్లు ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు తాత్కాలిక సబ్ రిజిస్ట్రార్లుగా పని చేస్తారని అన్నారు. ముగ్గురితో కలిపి ఒక బృందంగా మూడు బృందాలను ఏర్పాటు చేసామన్నారు. వీరు గ్రామాలకు వెళ్లి రైతులతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన అనంతరం సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలు నమోదు చేస్తారని వివరించారు. మంగళవారం నుంచి మల్లన్న సాగర్ భూ సేకరణ కార్యక్రమం జోరందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. వివాదాల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సేకరణ కార్యక్రమానికి వినాయక చవితితో విఘ్నాలు తొలగిపోయినట్లు చెప్పవచ్చు.