తెలంగాణ

స్లాబ్ కూలి ఏడుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఏడుగురికి గాయాలైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లో రోడ్‌నెంబర్ 33 ప్లాట్‌నెంబర్ 545లో నిలేష్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం భవనంపై మరో స్లాబ్‌ను నిర్మిస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ సమయంలో పనిచేస్తున్న శ్రీను, నూర్ హుస్సేన్, అద్నాన్, లక్షమయ్య, మహేష్, షాబీర్ షేక్‌లతో పాటు భవన యజమాని నీలేష్ కూడా స్పల్పగాయాలు అయ్యాయి. వీరిని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరు చికిత్స పొందుతుండగా మిగిలిన వారిని డిశ్చా ర్జ్ చేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న జిహెచ్‌ఎంసి సర్కిల్ - 10బి డిఎంసి అశోక్ సామ్రాట్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి వెళ్లి చికి త్స పొందుతున్న వారిని పరామర్శించారు.