తెలంగాణ

ఒక జడ్‌పి.. ముగ్గురు కలెక్టర్ల్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచి పోయినా ఇంకా ఉద్యోగుల బదిలీ, రెండు రాష్ట్రాల మధ్య పలు కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో ఆస్తుల బదిలీ వంటి సమస్యలు తీరనే లేదు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలకు ఇలాంటి సమస్యలు ఎదురు కానున్నాయి. ఒక్కో జిల్లా రెండు నుంచి మూడు జిల్లాల వరకు అవుతోంది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలు సగటున ఒక్కో జిల్లా మూడు జిల్లాలు అవుతోంది. ఒక్క జిల్లా పరిషత్తు ముగ్గురు కలెక్టర్లు ఉండే చిత్రమైన పరిస్థితి దసరా నుంచి ఏర్పడబోతోంది. అదే విధంగా 12 జిల్లాలకు అసలు మంత్రులే ఉండని పరిస్థితి. శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రివర్గం సంఖ్య 18. ఇప్పుడు మంత్రుల సంఖ్య అంతే.
పది జిల్లాలు కాస్తా 27 జిల్లాలు అవుతుంటే 18 మంది మంత్రుల్లో నలుగురు హైదరాబాద్ జిల్లా నుంచే ఉన్నారు. మిగిలిన 26 జిల్లాలకు కేవలం 14 మంది మంత్రులే ఉంటారు. సగటున రెండు జిల్లాలకు ఒక మంత్రి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి జిల్లాలకు మంత్రులే లేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, జిల్లా ప్రజాపరిషత్తు అధ్యక్షులు ఐదేళ్ల కోసం ఎన్నికవుతారు. వారిని మధ్యలో తొలగించడానికి అవకాశం లేదు. మరో రెండున్నర ఏళ్ల పాటు ప్రస్తుత జిల్లా పరిషత్తు చైర్మన్‌లు, మండలాధ్యక్షులు ఉంటారు. 27 రెవెన్యూ జిల్లాలు ఏర్పడినా, జిల్లా పరిషత్తులు మాత్రం పాత విధానంలోనే ఉంటాయి. సగటున మూడు జిల్లాలకు ఒక జిల్లా పరిషత్తు చైర్మన్ ఉంటారు. జిల్లా పరిషత్తు సమావేశం అంటే ప్రస్తుతం ఒక జిల్లా పరిషత్తు సమావేశం మాత్రమే. దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత జిల్లా పరిషత్తు సమావేశం అంటే మూడు జిల్లాల సమావేశం అవుతుంది. జిల్లా పరిషత్తు సమావేశాల్లో జిల్లా కలెక్టర్‌ది కీలక పాత్ర. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తరువాత జిల్లా పరిషత్తు సమావేశం అంటే పాత జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు సమావేశం జరుగుతుందా? లేక మూడు జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటారా? అనేది ఇంకా తేలలేదు.
జిల్లా పరిషత్తులు మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మూడు జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇదో చిత్రమైన పరిస్థితి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఒక శాసన సభా నియోజక వర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళుతోంది. దీంతో ఆ శాసన సభ్యుడు తన నియోజకవర్గ సమస్యలపై మూడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఇలాంటి సమస్యలు తప్పవని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు పార్లమెంటు సభ్యులకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు లేవు.
నియోజక వర్గాల పునర్విభజన 2019 వరకు జరిగే అవకాశం లేదు. దాంతో అప్పటి వరకు ఈ సమస్య తప్పదు. దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినా పాలనా పరంగా దాదాపు రెండేళ్ల పాటు బాలారిష్టాలు తప్పవని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పోలీసు జిల్లా పరిధి, రెవెన్యూ జిల్లా పరిధి, జిహెచ్‌ఎంసి పరిధి వేరువేరుగా ఉన్నాయి. జిల్లాల్లో సైతం ప్రస్తుతానికి ఇదే విధంగా వేరువేరు పరిధి ఉంటుంది. రెవెన్యూ జిల్లా పరిధి, జిల్లా ప్రజాపరిషత్తు పరిధి వేరు వేరుగా ఉంటుంది. దసరాకు కొత్త జిల్లాలు ఏర్పడినా పూర్తి స్థాయిలో జిల్లా స్వరూపం ఏర్పడేది 2019 ఎన్నికల తరువాతనే. తాత్కాలికంగా ప్రారంభంలో కొన్ని సమస్యలు తప్పవని వీటిని దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్ర విభజన తరువాత 10 జిల్లాల్లోనే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పుడు 27 జిల్లాలు అయిన తరువాత ఈ కొరత మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. జిల్లాల ఏర్పాటు తరువాత ఉద్యోగులను సర్దుబాటు చేసి అవసరాన్ని బట్టి కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.