తెలంగాణ

టిఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ‘టిఆర్‌ఎస్ నేతలను గద్దె దించండి, టిఆర్‌ఎస్ జెండా దిమ్మెలను పగుల గొట్టండి..’ అని తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల పేరిట జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరాదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.
ఈ వ్యవహారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని, ప్రస్తుతం మంత్రి కెటిఆర్ సిరిసిల్లకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే తన ప్రయత్నాలను మానుకుని, లోగడ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలాల విభజన విషయంలోనూ ప్రజల మధ్య గొడవలు జరిగే పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు నియమించిన అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలకు ప్రాతిపదిక ఏమిటీ?, విధివిధానాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కొత్త జిల్లాల బాటపట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న 27 జిల్లాల్లో ఆరు జిల్లాలు కేవలం 7 లక్షల జనాభాను కలిగి ఉండగా, మిగతా జిల్లాలు 15 నుంచి 40 లక్షల వరకు జనాభా కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. జనాభాలో ఇన్ని తేడాలు ఉంటే సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.