తెలంగాణ

అటవీ శాఖలో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ పాలన సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణం, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అరణ్యభవన్‌లో మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో నూతన జిల్లాల్లో అటవీ శాఖ అధికారుల విధులు, విధి విధానాలు, కొత్త పోస్టులు, పరిపాలనా పరమైన అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో శాఖాపరంగా తీసుకోవలసిన చర్యలను సత్వరమే పూర్తి చేయాలని మంత్రి జోగు రామన్న సూచించారు. ప్రస్తుతం అటవీ శాఖలో ఉన్న పోస్టులు, డివిజన్స్, రేంజ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రతిపాదించినట్టు ఆయన తెలిపారు. అటవీ శాఖ ప్రతిపాదనలు పూర్తి కాగానే ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా జిల్లా అటవీ అధికారి పోస్టులను ప్రత్యేకంగా సృష్టించాలని ప్రతిపాదించారు. జిల్లా అటవీ అధికారి శాఖాపరమైన పరిపాలన, టెర్రిటోరియల్, సోషల్ ఫారెస్ట్, లాగింగ్ వ్యవహారాలు చూసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు జోగు రామన్న తెలిపారు. ప్రతి జిల్లాలో ఒకటి నుంచి నాలుగు వరకు ఫారెస్ట డివిజన్స్‌ను పెంచనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టును ఇక నుంచి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా మార్చుతూ ప్రతిపాదించినట్టు చెప్పారు. 22 నుంచి 48 డివిజన్స్‌ను పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐదు సర్కిళ్ల సంఖ్యను 16కు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఐదు సిసిఎఫ్ పోస్టులను సృష్టించనున్నట్టు చెప్పారు. 12 సర్కిళ్లలో ప్లయింగ్ స్క్వాడ్ విభాగం సిబ్బంది ఉండేలా ప్రతిపాదించామని చెప్పారు.