తెలంగాణ

ఆర్డీవోల చేతిల్లోకి కల్యాణ లక్ష్మి స్కీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక నుండి రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డిఓ) చేతుల్లోకి వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన యువతులు ఎవరైనా వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తే, వారి వివాహానికి 50 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే ముస్లింలలో పేద యువతుల పెళ్లిళ్లకు కూడా షాదీ ముబారక్ పేరుతో 50 వేల రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత జిల్లా స్థాయిలో సంబంధిత శాఖ జిల్లా అధికారులే వీటిని అమలు చేస్తున్నారు. అయితే ఈ శాఖలకు గ్రామస్థాయి వరకు తగినంత సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది కలుగుతూ వస్తోంది.
లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు, అక్రమాలకు అవకాశాలు ఏర్పడ్డాయి. పైగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ శాఖల జిల్లా అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు లేవు. మెజిస్టీరియల్ అధికారాలు కేవలం తహశీల్దారులు, ఆర్‌డిఓలు, డిఆర్‌ఓలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లకు మాత్రమే ఉన్నాయి. ఆర్‌డిఓ కింద పనిచేసేందుకు గ్రామస్థాయి వరకు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. గ్రామస్థాయిలో గ్రామరెవెన్యూ సహాయకులు (విఆర్‌ఎ), గ్రామ రెవిన్యూ అధికారులు (విఆర్‌ఓ) పనిచేస్తున్నారు. గ్రామపాలనకు సంబంధించి విఆర్‌ఓకు విస్తృతమైన అధికారాలున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక, వారికి నిధులను సమకూర్చడం వీరి ద్వారా చేసేందుకు వీలుంది. దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులు అర్హులా కాదా అన్న అంశంపై వీరు తహశీల్‌దారుకు సిఫార్సు చేస్తారు. తహశీల్దారు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈరెండు పథకాల కింద డబ్బును ప్రభుత్వం ఆర్‌డిఓ నేతృత్వంలోని పిడి అకౌంట్‌కు జమచేస్తుంది. అన్ని కోణాల్లో పరిశీలన తర్వాత లబ్దిదారులకు నిధులను బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తారు. ఎవరైనా తప్పుచేస్తే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.