తెలంగాణ

గురుకులాల్లో ‘క్వాలిటీ’ గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: విద్యా ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన ప్రామాణిక కార్యాచరణ (ఎన్‌క్యూపి-2016)పై గురుకులాల ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ముఖచిత్రం మార్చేందుకు కార్యదర్శిగా డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై గురుకుల సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన ప్రామాణిక కార్యాచరణ (ఎన్‌క్యూపి) ఉద్దేశం మంచిదే, కాని అందుకోసం కార్యదర్శి అనుసరిస్తున్న విధానం మాత్రం సరైంది కాదని గురుకుల సిబ్బంది వాపోతున్నారు. 30 ఏళ్ల క్రితం తెలుగుమీడియంలో చదువుకుని ఉద్యోగం చేరి, ఇంగ్లీషు మీడియంలో బోధిస్తూ విద్యార్థులకు ఎన్నో ర్యాంకులు తెచ్చి పెట్టిన ఒక టీచర్‌ను అసెస్‌మెంట్ పేరుతో ఇపుడు పరీక్షలు పెట్టాలని చూస్తే ఎలా...అని ఒక ఉపాధ్యాయురాలు ప్రశ్నించారు. పనితీరు మెరుగుపడలేదని బదిలీలు చేయడం ఇంక్రిమెంట్లకు కోత విధించడంతో ఉపాధ్యాయులు మానసికంగా చితికిపోతున్నారని నేతలు వాపోతున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న టీచర్లను సైతం విడిచిపెట్టడం లేదని, వారిని గురుకులాల పూర్వ విద్యార్ధుల సంఘం ఏర్పాటు చేసి వారిద్వారా సమీక్షలు చేయించడం సిగ్గుచేటుగా ఉందని ఒక లెక్చరర్ వాపోయారు. తాము ఎమ్సెస్సీలు చదివి ఉద్యోగాలు చేస్తుంటే తమకంటే తక్కువ చదివిన పూర్వ విద్యార్థులతో తమను సమీక్షించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఏకతాటిపైకి సిబ్బంది
తొలి రోజుల్లో కార్యదర్శి కార్యక్రమాలను స్వాగతించిన సిబ్బంది, తర్వాతర్వాత వారిపై ఒత్తిడి పెరగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే సిబ్బంది ఏకత్రాటిపైకి వచ్చారు. ఎనిమిది డిమాండ్లతో కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అందులో ప్రధానమైనది ఎన్‌క్యూపి పేరుతో సెమినార్లు, ప్రజెంటేషన్ల విధానం తొలగించాలని వారు కోరారు. అలాగే సిఆర్‌టిఎస్, అడ్‌హక్ టీచర్లను కొనసాగించాలని, అశాస్ర్తియమైన రూల్ 28ఎను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పిఆర్‌సి 2015 పే స్కేళ్లను మూడు దశల్లో అమలు చేయాలని , ఉద్యోగుల విభజన, ఆరోగ్య కార్డులు జారీ, కొత్త విద్యా సంస్థలకు పదోన్నతులు, రెగ్యులర్ పోస్టుల మంజూరు వంటి డిమాండ్లతో వారు కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు, అయితే ఇంత వరకూ దానిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో నిరసన బాట పట్టారు. 8 నుండి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, మంత్రులకు వినతి పత్రాలు అందించాలని, 10న భోజన విరామ సమయంలో ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు స్ట్ఫా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్‌డబ్ల్యుఆర్‌టియు అధ్యక్షుడు కె అర్జున్, ఎస్‌డబ్ల్యుఆర్‌జెఎ అధ్యక్షుడు కె రవీందర్‌రెడ్డి, టిఎస్‌ఆర్‌టిఇఎ అధ్యక్షుడు కె నరేందర్‌రెడ్డి, ఎస్సీఎస్టీ సిబ్బంది అధ్యక్షుడు కె యాదయ్య తదితరులు పేర్కొన్నారు.
చదువు చెప్పమంటే సమ్మెనా?
విద్యార్ధులకు చదువు చెప్పమంటే సిబ్బంది సమ్మెకు వెళతామనడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ దండోరా దుయ్యబట్టింది. దండోరా వ్యవస్థాక అధ్యక్షుడు సతీష్ మాదిగ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయమనడం తప్పా అని నిలదీశారు.
శిక్షలు అమలు చేయబోం: మంత్రి
ఎన్‌క్యూపీ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు తెలిసింది. గురుకులాల బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని సవరణలు చేసినట్టు సాంఘిక సంక్షేమ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. కనీసం 50 శాతం ప్రగతి చూపిన టీచర్లకు మరోమారు పరీక్ష నుండి మినహాయించినా శిక్షణ కొనసాగిస్తారని, టీచర్లు పాఠాలు చెబుతున్నపుడు వీడియోరికార్డింగ్‌ను నిలిపివేస్తారని అన్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని మినహాయిస్తారని, సెమినార్ ప్రెజెంటేషన్‌కు ముందు అవసరం అనుకుంటే టీచర్లకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో గుర్తింపుపొందిన, అర్హులైన వారిని మాత్రమే టీచర్లను పరీక్షించేందుకు వినియోగిస్తామని, ఎన్‌క్యూపీ ప్రతిభాపాటవాల ఆధారంగా ఎలాంటి శిక్ష టీచర్లకు అమలుచేయడం లేదని జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. జూనియర్ ఇంటర్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను సైతం పరిగణనలోకి తీసుకుని అపుడు మాత్రమే రూల్ 28 అమలుచేస్తామని పేర్కొన్నారు.