తెలంగాణ

రేపు విద్యార్థుల కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబఱ్ 6: ఫీజులు బకాయిలు 1900 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, స్కాలర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న (గురువారం) కలెక్టరేట్లను, తహాశిల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. గత సంవత్సరం ఫీజుల బకాయిలు 1900 కోట్లు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు నెలకు 2 వేల రూపాయలకు పెంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్లను, తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.