తెలంగాణ

ఉత్పత్తిపై దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ గనుల నుంచి అధికోత్పత్తిని సాధించే మైనింగ్ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. శ్రీ్ధర్ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి కోల్ సమ్మిట్-2016లో రెండవ రోజు మంగళవారం కో-చైర్ పర్సన్‌గా శ్రీ్ధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ ప్రసంగిస్తూ భారత బొగ్గు పరిశ్రమ నలదొక్కుకోవాలంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గును అందించాలనీ, పర్యావరణ హితంగా రవాణా చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆస్ట్రేలియా దేశంలో భూగర్భ గనుల ద్వారా 4 నుంచి 5 మిలియన్ టన్నుల బఒగ్గు ఉత్పత్తి చేస్తున్న ఆధునిక పద్ధతులపై తామూ దృష్టి సారించాల్సి ఉందని ఆయన తెలిపారు. సోమవారం ప్రారంభమైన కోల్ సమ్మిట్ బుధవారంతో ముగియనున్నది. ఈ సమ్మిట్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు మంత్రిత్వ శాఖలు (బొగ్గు, ఇంధనం, గనులు, స్టీలు, రైల్వే), నీతి ఆయోగ్ సంస్ధ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్విందర్ కుమార్ ప్రారంభించారు.