తెలంగాణ

కౌంటర్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించిన అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తెలంగాణ పోలీసుశాఖను ఆదేశించారు. వై సంతోష్ రెడ్డి మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వేములగాట్ తదితర గ్రామాల్లో గత 40 రోజులుగా సిఆర్‌పిసి 144 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని వారు కోర్టుకు తెలిపారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ యు దుర్గాప్రసాద్‌తో కూడిన ధర్మాసనం జీవో 123ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, భూమి యజమానుల నుంచి ప్రభుత్వం తీసుకోవడం లేదని తెలిపారు. కాగా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని తాజాగా పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీన విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.