తెలంగాణ

ఎంజికెఎల్‌ఐలో సిస్టర్న్ లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 6: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పరిధిలోని ఎంజికెఎల్‌ఐ మూడో లిప్టులోని మొదటి పంపు ట్రయల్న్‌న్రు విజయవంతం చేసిన అధికారులకు పంపుహౌస్‌లోకి నీరు రావడాన్ని గమనించి లోపం ఎక్కడుందో మంగళవారం ఉదయం గుర్తించారు. పంపులో నుంచి వస్తున్న నీటి ప్రవాహం సిస్టర్న్‌కు తగలి వేగంగా పైపుల ద్వారా పంపుహౌస్‌లోకి నీరు వస్తోందని, పవర్ హౌస్‌కు కూడా ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన ఇంజనీరింగ్ అధికారులు సిస్టర్న్ గోడ ఎత్తును తగ్గించాలని నిర్ణయించారు.
దానికి అనుగుణంగా సిస్టర్న్ గోడను తగ్గించేందుకు డిటోనేటర్లతో పేల్చి సిమెంట్ కట్టడాన్ని పెకిలించి యంత్రంతో వాటిని తొలగించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సిస్టర్న్‌లో డిటోనేర్లతో బ్లాస్టింగ్ చేయడంతో మొత్తం లిప్టుకే ముప్పు వాటిల్లుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు అర్థం రవి, కాశన్న, బొల్లారం వెంకట్రాములు తదితరులు ఇదే అంశంపై ప్రశ్నించారు. శాస్ర్తియంగా సిస్టర్న్ గోడను తొలగించకుండా డిటోనేటర్లను పేల్చి తొలగించడం సరికాదని, లీకేజీలు ఏర్పడి మొత్తం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి మాట్లాడుతూ సిస్టర్న్‌లో వచ్చిన చిన్న లోపాన్ని గుర్తించి సరిచేస్తున్నామని తెలిపారు. డిటోనేటర్లతో తొలగించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంపును ఆన్‌చేసి రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా తీసుకొని పనులు చేస్తున్నామన్నారు.