తెలంగాణ

ఎడమకాల్వకు నీరు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 6: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఆరుతడి పంటలకుగాను ఎడమకాల్వ ద్వారా విడదల చేస్తున్న నీటిని డ్యాం అధికారులు సోమవారం అర్ధరాత్రి నిలిపివేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టు సిఇ సునీల్ మాట్లాడుతూ ముందుగా ప్రకటించినట్లుగా ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని, మొదటి విడుతగా 12 రోజులు విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ 12 రోజులలో ఎడమకాల్వకు ఇప్పటివరకు ఐదు టిఎంసిల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రెండవ విడతగా ఈనెల 12 నుండి మరల నీటి విడదల కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 512.40 అడుగుల నీటిమట్టం ఉండగా శ్రీశైలం నుండి 3,005 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.