తెలంగాణ

నరుూంకు ఆయుధాలు శ్రీధర్‌గౌడ్ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూంకు ఆయుధాలు సరఫరా చేసిన వారిని సిట్ గుర్తించింది. నరుూం డ్రైవర్ శ్రీ్ధర్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరు నరుూంకు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చారని సిట్ అధికారులు గుర్తించారు. వనస్థలిపురంకు చెందిన శ్రీ్ధర్‌గౌడ్ నరుూం అండతో ఎల్‌బినగర్ శివారు ప్రాంతాల్లో భూ కబ్జా, బెదిరింపులు, కిడ్నాప్ వంటి అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకు నజరానాగా నరుూంకు ఉచితంగా ఆయుధాలు సరఫరా చేసే వాడని సిట్ అధికారుల విచారణలో తేలింది. అయితే ఈ ఆయుధాలను బీహార్ నుంచి శ్రీ్ధర్‌గౌడ్ స్వయంగా వెళ్లి తెచ్చి ఇచ్చేవాడని, ఒక్కో పిస్తోలు, రివాల్వర్‌కు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు వెచ్చించే వాడని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నరుూం అనుచరులు ఫర్హానా, అఫ్షా, ఫీహం, తాజుద్దీన్‌లకు మంగళవారంతో రిమాండ్ ముగిసింది. ఈ సందర్భంగా సిట్ వారి నుంచి పలు విషయాలు రాబట్టినట్టు సమాచారం. గోవాలో ఉన్న నరుూం అనుచరుడు తాజుద్దీన్, నరుూంకు దూరపు బంధువుఅని, నరుూం అక్రమ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా తమ కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు మరోసారి కస్టడీని కోరనున్నట్టు తెలిసింది.