తెలంగాణ

ఒకే గొడుగు కిందకు సారూప్య శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు జారీ చేసిన ముసాయిదాపై ప్రజల స్పందన, అధికారుల కసరత్తు ఆధారంగా చేర్పులు, మార్పులు చేసి తుది నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు, జిల్లాల కూర్పు, పరిపాలనా విభాగాల విలీనం తదితర అంశాల అధ్యయనాకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ మంగళవారం ఉదయం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లతో సమావేశమై టాస్క్ఫోర్స్ కమిటీ నివేదిక రూపొందించి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రికి అందజేసింది.
ప్రస్తుత ప్రభుత్వశాఖలలో చాలా మటుకు ఒకేవిధమైన స్వభావం కలిగిన శాఖలు ఉండటంతో వాటిని ఒకే అధికారి పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సిఫారసు చేసింది. మధ్యతరహా, చిన్న నీటిపారుదలశాఖలను ఒకే జిల్లా అధికారి పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. అలాగే వ్యవసాయం, ఉద్యానవనం, పట్టుపరిశ్రమ ఇవన్నీ ఒకే స్వభావం కలిగిన శాఖలు కావడంతో వీటిని కూడా ఒకే అధికారి పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. విద్యాశాఖలో అన్ని విభాగాలకూ ఒకే అధికారి ఉండాలని, అటవీశాఖ, సామాజిక అడవులు, వణ్యప్రాణి సంరక్షణ విభాగాలు అన్నింటికీ ఒకే అధికారి ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. గ్రామీణాభివృద్ధి, డ్వామా, సెర్ప్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని టాస్క్ఫోర్స్ కమిటీ సిఫారసు చేయగా ముఖ్యమంత్రి ఆమోదించారు. అయితే భారీ నీటిపారుదలశాఖ పరిపాలనా విభాగం మాత్రం జిల్లా యూనిట్‌గా కాకుండా ప్రాజెక్టుల వారీగా ఉండాలని కమిటీ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, అవినీతి, అక్రమాలను తగ్గించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.