తెలంగాణ

మంచిరెడ్డి వర్సెస్ మల్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: గ్యాంగ్‌స్టర్ నరుూంతో సంబంధాలు కలిగివున్నట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. దమ్ముంటే..తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం చౌరస్తాను వేదికగా ప్రకటించారు. సోమవారం తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయని పక్షంలో కోర్టుకు వెళతానని మంచిరెడ్డి హెచ్చరించారు.
మంచిరెడ్డితో నరుూంకు సంబంధాలున్నట్టు, ఆయన కొడుకుతో భూ దందాలు నెరపినట్టు, ఇన్‌ఫ్రా సొసైటీ పేరుతో ఆదిభట్లలో దాదాపు 50 ఎకరాలు రైతుల నుంచి లాక్కొని ప్లాట్ చేసి అక్రమార్జనకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. విచారణకు సిద్ధమని కూడా ప్రకటించారు. దీంతో ఇబ్రహీం పట్నం చౌరస్తా వేదికగా సిద్ధమైన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయాలని కోరుతూ, చౌరస్తా వద్ద బైఠాయించారు. అయితే సదరు ఆరోపణలపై విచారణకు సిద్ధమేనని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీంతో టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. తమ నేతపై నిరాధార ఆరోపణలు చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు.
నరుూంతో సంబంధాలు నెరిపిన రియల్టర్లు, రౌడీ షీటర్లే కాకుండా పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తిస్తున్నారు.
ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఎంపిపిలు, అరెస్టు కాగా, ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు కూడా బదిలీ అయ్యారు. ఓ ఎమ్మెల్సీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం కూడా తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు నరుూంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యం ఆసక్తికరంగా మారింది. నరుూంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి గల లింకులపై వారు వార్తల్లోకి ఎక్కారు. నరుూం అనుచరుడు శ్రీహరి అండతో వేల కోట్లు సంపాదించారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపిస్తుండగా, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెబుతున్నారు.
ఇబ్రహీం పట్నంలో రాజకీయంగా ఇద్దరు ఉద్దండులే..అయితే నరుూంతో లింకులపై పత్రికలకెక్కిన వీరి తరహలోనే ఇంకెంత మంది రాజకీయ నాయకులున్నారనే కోణం నుంచి దర్యాప్తు జరుపుతున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.
సామ సంజీవరెడ్డి అరెస్టు
నరుూం కేసులో సామ సంజీవరెడ్డిని సిట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమామ్‌గూడ, శ్రీరాంకాలనీలోని భూవివాదంపై యాదగిరిరెడ్డి, బుక్క రాంరెడ్డి, అంజిరెడ్డిల ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామ సంజీవరెడ్డిపై అక్రమ ఆయుధాలు కలిగివుండడం, ల్యాండ్ గ్రాబింగ్, కిడ్నాప్, చీటింగ్ కేసులను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అసాంఘిక శక్తులను
ఏరిపారేస్తాం: నాయని
హైదరాబాద్‌లో అసాంఘిక శక్తులను ఏరిపారేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గ్యాంగ్‌స్టర్ నరుూంతో అధికార పార్టీ నాయకుల లింకుపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎవరైనా..ఎంతటి వారైనా అవినీతి, అక్రమాలు, గూండాయిజానికి పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ నరుూం వ్యవహారంలో సిట్ అధికారులతో విచారణ జరుగుతుందని, దోషులెవరైనా శిక్ష తప్పదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.