తెలంగాణ

బండరాయిలో నీటి ఊట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, సెప్టెంబర్ 6: తీవ్ర వర్షాభావంతో వందలకొలది అడుగుల లోతు బోరు డ్రిల్ వేసినా చుక్కనీరు రాని పరిస్థితుల్లో గుడి నిర్మాణం కోసం పిల్లర్ గుంత తవ్వుతుండగా ఆరడుగుల లోతులో బండరాయి నుండి నీరు ఉబికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం ఖాజిపల్లి శివారులో గల కాలభైరవస్వామి దేవాలయం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... ఖాజిపల్లి శివారులో ఇప్పటికే కాలభైరవస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఐదేళ్లుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి అష్టకాలభైరవస్వామి దేవాలయ నిర్మాణానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం పిల్లర్ నిర్మాణానికి గుంత తవ్వుతుండగా బండరాయి రావడంతో పగులగొట్టగా నీటి ఊట బయటపడి పెద్దయెత్తున నీరు ఉబికివస్తోంది. నీటిని తోడడానికి మోటార్ ఏర్పాటు చేశారు. ఆరడుగుల లోతులో బండరాయి నుండి నీటివ ఊటరావడం సమాచారం రావడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్దయెత్తున అక్కడికొచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతా భగవంతుని అనుగ్రహమేనని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

చిత్రం.. బండరాయి మధ్యలో ఉబికివచ్చిన నీరు, తోడేందుకు ఏర్పాటు చేసిన మోటార్