తెలంగాణ

గుడిగా మారిన గడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 6: ఆ గడీ ఒకప్పటి జమీందారీ వ్యవస్థకు చిహ్నం.. రాచరికపు రాజసనానికి, గత వైభవానికి గుర్తు... అయతే అలాంటి వాటిని కొంతమంది వారసులు కూల్చివేసి ప్లాట్లుగా విక్రయంచుకుంటున్న తరుణంలో... పూర్వీకుల వారసత్వ సంపదను ఆలయంగా తీర్చిదిద్ది ఆదర్శప్రాయంగా నిలిచారు దేశముఖ్ వారసులు. తమ దాతృత్వంతో ఊరి మొత్తానికి ఆధ్యాత్మిక శోభ చేకూర్చారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో తన పూర్వీకుల గడీని సాయిబాబా మందిరంగా పునర్నిర్మించారు. 1940 -1946 మధ్యకాలంలో దేశ్‌ముఖ్‌గా ఉన్న దివంగత చెన్నమనేని వెంకటనర్సింహారావు రాయికల్ మండలం ఇటిక్యాల గడీని కేంద్రంగా చేసుకుని 8 గ్రామాల పాలన సాగించారు. స్వాతంత్య్రం అనంతరం దేశ్‌ముఖ్‌ల గడీ పాలన ముగియడంతో ఇటిక్యాల గడీ మూలన పడింది. దేశ్‌ముఖ్ చెన్నమనేని వెంకట నర్సింహారావు తదనంతరం ఆయన మూడవ కుమారుడైన ఎఎన్‌ఎల్ కొరియర్ అధినేత సిహెచ్‌ఎంవి కృష్ణారావు బృహత్ సంకల్పంతో మూలనపడ్డ గడీని మరమ్మతులు చేయించి సాయిబాబా మందిరంగా మార్చారు. అంతేకాకుండా ఈ గడీ నిర్వహణ కోసం 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 30 ఎకరాల్లో మామిడి తోట, 40 ఎకరాల్లో పప్పుదినుసుల సాగును చేపట్టారు. దానికి తోడు పూలసాగును చేపట్టి రోజువారి సాయిబాబా పూజలకు ఈ పూలనే వినియోగించడం విశేషం. మామిడి ఫలసాయం ద్వారా వచ్చే ఆదాయంతోనే గుడి నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలకు కేటాయించడం, మిగతా సాగుభూమిలో పండే పంటతో ప్రతి పౌర్ణమికి, పర్వదిన వేడుకల్లో ఉచిత భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద కల్యాణ మండపాన్ని నిర్మించి పేద కుటుంబాలకు ఉచితంగా పెళ్లి వేడుకలకు అందిస్తున్నారు. నిరుపయోగంగా, అన్యాక్రాంతం అవుతున్న గడీని దేశ్‌ముఖ్ మూడవ కుమారుడి ఆలోచన ఇటిక్యాల గడీని గుడిగా మార్చింది.

చిత్రం.. ఇటిక్యాలలో సాయబాబా ఆలయంగా రూపుదిద్దుకున్న గడీ