తెలంగాణ

నిమ్జ్‌కు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్‌లో ఫార్మాసిటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌తోపాటు రాష్ట్రంలో నెలకొల్పనున్న డ్రైపోర్టుల మాస్టర్ ప్లాన్, వౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) కార్యదర్శి రమేష్ అభిషేక్, సహాయ కార్యదర్శి శైలేంద్ర సింగ్‌తో కూడిన బృందంతో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమలు, వాణిజ్య, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతోపాటు పెట్టుబడులు పెట్టడానికి ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర బృందానికి సిఎస్ రాజీవ్ శర్మ వివరించారు. ఫార్మాసిటీలో ఫార్మా యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహకానికి నూతన పారిశ్రామిక విధానాన్ని (టిఎస్-పాస్) ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పరిశ్రమలశాఖ కమిషనర్ మానిక్ రాజ్ వివరించారు. పరిశ్రమల స్థాపనకు గతంలో 114 అనుమతులు పొందాల్సిఉండగా, వాటిని 12కి కుదిస్తూ జీవో 84ను ప్రత్యేకంగా తీసుకొచ్చామన్నారు. డిఐపిపి కార్యదర్శి రమేష్ అభిషేక్ స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం దేశంలో మరేక్కడా లేదని అభినందించారు. కేంద్ర సాయాన్ని కోరుతున్న ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను పంపిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొల్పనున్న పరిశ్రమల కారిడార్‌ను కేంద్ర కారిడార్‌లో చేర్చాలని యోచిస్తున్నట్టు రమేష్ అభిషేక్ చెప్పారు.