తెలంగాణ

పునరావాస అథారిటీని ఏర్పాటుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కేంద్రం 2013లో చేసిన భూసేకరణ, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుల చట్టం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పునరావాస అథారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. 2013 భూసేకరణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాలు అథారిటీ ఏర్పాటు చేయడం రాజ్యాంగ బద్ధమని హైకోర్టు పేర్కొంది. నాలుగు వారాల్లోగా ఈ అథారిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎస్‌పి రోడ్డులో నివాసముంటున్న ఎంఏ అజీజ్ అనే వ్యక్తి ఒక కేసులో జిహెచ్‌ఎంసికి చెందిన డిప్యూటీ కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు 2013 భూసేకరణ చట్టం కింద చెల్లవంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తన క్లయింటుకు చెందిన 181 గజాల స్థలాన్ని మెట్రోరైలు నిర్మాణం కోసం మెట్రోరైలు సంస్థ తీసుకుందని పిటిషనర్ తరఫున న్యాయవాది వి రామచంద్రగౌడ్ కోర్టుకు తెలిపారు. చదరపు గజానికి 15వేల రూపాయలు నిర్ణయిస్తూ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. కాని మార్కెట్ విలువ గజం యాభై వేల రూపాయలుందన్నారు. గతంలో ఇచ్చిన అవార్డును పక్కనపెట్టి తాజాగా అవార్డును జారీ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని 2013 భూకసేకరణ నిర్వాసితులు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుల చట్టం కింద అథారిటీ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొంది. ఈ అథారిటీ ఏర్పాటు చేసిన తర్వాత పిటిషనర్ తన పిటిషన్‌ను అథారిటీకి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ప్రభుత్వం అథారిటీ ఏర్పాటు చేయని పక్షంలో పిటిషనర్ కోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు పేర్కొంది.

క్యూఎస్ రేటింగ్‌లో హెచ్‌సియు
మూడు శాఖలకు అంతర్జాతీయ ర్యాంకింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఉన్నతస్థాయి విద్యాసంస్థల ప్రమాణాల మేరకు ర్యాంకింగ్ ఇచ్చే క్యూఎస్ వరల్డ్ సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మూడు విభాగాలకు అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్‌ను ఇచ్చింది. 42 బోధనాంశాల్లో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మూడో స్థానం దక్కింది. ఇంగ్లీషు లాంగ్వేజి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో హెచ్‌సియుకి ఈ ఖ్యాతి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3800 సంస్థలు , 74651 విద్యా విభాగాలు, 37,781 మంది సిబ్బంది పనితీరును సమీక్షించిన తర్వాత క్యూఎస్ సంస్థ ఈ ర్యాంకింగ్‌లను ఇస్తుంది. ఈ ర్యాంకులు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని విసి ప్రొఫెసర్ పి అప్పారావు పేర్కొన్నారు.
ఆంధ్రాలో బిసి భవన్‌లు
ఆంధ్రాలో ప్రతి జిల్లాలో ఐదు కోట్ల రూపాయిల వ్యయంతో బిసి భవన్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
2011 గ్రూప్-1 జనరల్ స్టడీస్ పరీక్ష 24కు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణలో 2011నాటి గ్రూప్-1 మెయిన్ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్‌ను ఈ నెల 13కు బదులు 24వ తేదీన నిర్వహిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరీక్ష మినహా మిగిలిన ఏ పరీక్షల షెడ్యూలులోనూ మార్పు లేదని ఆమె చెప్పారు.