తెలంగాణ

73మంది ఉపాధ్యాయులకు నేడు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థలకు చెందిన 73 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గురువారం నాడు ప్రభుత్వం సత్కరించనుంది. ఈ కార్యక్రమం రవీంద్రభారతిలో జరుగుతుంది. 5వ తేదీన జరగాల్సి ఉన్నా, ఆ రోజు వినాయక చవితి కావడంతో గురువారం నాటికి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం మార్చింది. పాఠశాల విద్య నుండి 17 మంది, ఎన్‌ఎఫ్‌టిడబ్ల్యు నుండి 14 మంది, ఇంటర్ విద్య నుండి 9, సాంకేతిక విద్య నుండి ముగ్గురికి, యూనివర్శిటీల నుండి 27 మందికి, లాంగ్వేజి కల్చర్ శాఖ నుండి ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరవుతారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు మంత్రులు, ఎంపిలు, శాసనమండలి సభ్యులు, ఎంఎల్‌ఎలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

గద్వాలపై కెసిఆర్‌కు ఎందుకంత కసి: డికె
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ‘ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు గద్వాలపై ఎందుకు అంత కసి..’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. గద్వాల జిల్లా కోసం ప్రజల్లో సెంటిమెంట్ పెరుగుతున్నదని ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో గద్వాల జిల్లా లేదన్న అభ్యంతరాలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని చెప్పడం సరైంది కాదని ఆమె తెలిపారు. ఒక్క వ్యక్తి నుంచి 6 వేల విజ్ఞప్తులు ఆన్‌లైన్‌లో రావడం సాధ్యమా? అని ఆమె ప్రశ్నించారు. అత్యధిక అభ్యంతరాలు వనపర్తి జిల్లా ఏర్పాటుపై వచ్చాయని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పంతంతో గద్వాల జిల్లా కాకుండా చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి చెప్పిన మాటలను మరిచిపోరాదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ లబ్ది కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా వ్యక్తుల సౌకర్యం పక్కన పెట్టి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆమె ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటుకు ముందు ఏ ఒక్క చోటైనా గ్రామ సభ నిర్వహించారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సిఎం కెసిఆర్‌కు సురవరం లేఖ
గద్వాల, జనగామ జిల్లాల కోసం ప్రజలు చేస్తున్న ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య భాగమైన నడిగడ్డకు గద్వాల కేంద్రం అనువైందని తెలిపారు.

పాత పాస్‌పోర్ట్‌లను
ఎలక్ట్రానిక్‌కు మార్చుకోండి
ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి అశ్విని
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: చేతి రాతతో జారీ కాబడిన పాస్‌పోర్ట్‌లను వెంటనే ఎలక్ట్రానిక్ మిషన్‌కు కన్వర్ట్ చేసుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి ఎస్ అశ్విని ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నవంబర్ నాటికి 20 సంవత్సరాల వ్యాలిడిటీతో కూడిన సుమారు 2.5 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయని, వీటిని వెంటనే రీడబుల్ మిషన్‌కు కన్వర్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
రియల్టర్ కిడ్నాప్
లంగర్‌హౌస్ పిఎస్‌లో ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: నగరంలోని ఓ రియల్టర్ కిడ్నాప్‌కు గురయ్యాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన దావూద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని ఇంటి సమీపంలో కొందరు అతని కారును అడ్డగించి, కళ్ళలో పెప్పర్ కొట్టి కిడ్నాప్ చేశారు. దావూద్ బంధువులే కిడ్నాప్‌కు పాల్పడినట్టు అతని కుటుంబ సభ్యులు లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
‘బక్రీద్ దృష్ట్యా జెఎన్‌టియు
పరీక్షలు వాయిదా వేయండి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: బక్రీద్ దృష్ట్యా జెఎన్‌టియు పరీక్షలను వాయిదా వేయాలని టి.పిసిసి అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12న బక్రీద్ (ఈద్-ఉల్-అదహ)ను ముస్లింలు పెద్ద ఎత్తున జరుపుకోనున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాగా 13వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు జెఎన్‌టియు సమాయత్తమైందని అన్నారు. ముస్లింలకు రంజాన్, బక్రీద్ ముఖ్యమైన పండుగలని ఆయన తెలిపారు. కాబట్టి జెఎన్‌టియుతో పాటు ఇంకా ప్రభుత్వం ప్రకటించిన ఇతరత్రా పరీక్షలన్నింటినీ మరో తేదీకి వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్ రంగాలపై
ముఖ్య కార్యదర్శి సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్ సహకార సంఘాల గురించి, చేనేత వస్త్రాల నిల్వ, ఇతరత్రా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో పెట్టాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం ఏ దశలో ఉన్నదని ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మల్కనూరులో, వరంగల్‌లో నిర్మించాలనుకున్న మినీ టెక్స్‌టైల్ పార్కుల గురించి, నల్లగొండ జిల్లా కనుకులలో నిర్మించాలనుకున్న పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమానికి అందిస్తున్న సహాయం, ప్రోత్సహాకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

సిట్ కాదు సిబిఐ విచారణ
నరుూం కేసుపై విహెచ్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: నరుూం కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, సిబిఐతో జరిపించాలని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు విహెచ్ బుధవారం విలేఖరులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తోందని హనుమంత రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు 50వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వం అలాగే ఉంది, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి టి.హరీశ్‌రావు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. నాబార్డు నుంచి 7వేల కోట్లు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరానికి అన్ని నిధులూ కేంద్రమే ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెస్తున్నదని దుయ్యబట్టారు.