తెలంగాణ

ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటితో ఆఫీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకోసం కోటి రూపాయలతో ఒక భవనాన్ని నిర్మిస్తామని రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కం రెసిడెన్స్ కోసం ఈ భవనాన్ని వినియోగిస్తామన్నారు. ఈ భవనాల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, వచ్చే నెలలో భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని ఏడాదిలోగా వీటి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇలా ఉండగా హైదరాబాద్‌లో ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 120 మంది ఎమ్మెల్యేలకు క్వార్టర్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.
తెలంగాణలో గతంలో 2600 కిలోమీటర్ల జాతీయ రహదార్లు ఉండగా, సిఎం కెసిఆర్ చొరవతో ఏడాది కాలంలోనే మరో 2600 కిలోమీటర్లను జాతీయ రహదార్లుగా కేంద్రం ప్రకటించిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు 180 కిలోమీటర్ల వరకు ఉందని, ఇది కాకుండా మరో 300 కిలోమీటర్లతో ఇంకో రోడ్డు వస్తోందన్నారు.
ఈ రోడ్డు సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-్భవనగిరి-చౌటుప్పల్-ఆమన్‌గల్-షాద్‌నగర్-కందిలను కలుపుతుందన్నారు. ఈ రోడ్డుకు కూడా జాతీయ రహదారిగా గుర్తింపు వచ్చిందన్నారు. అలాగే హైదరాబాద్-్భద్రాచలం రోడ్డుకు కూడా జాతీయ రహదారి గుర్తింపు వచ్చిందని, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి రోడ్డుకు కూడా జాతీయ హోదా లభించిందన్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలను దృష్టిలో ఉంచుకుని తన అధీనంలోని రోడ్లు భవనాలు, స్ర్తిశిశు సంక్షేమం శాఖల్లో మార్పులు చేర్పులపై బుధవారం సవివరంగా సమీక్షించానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేస్తామన్నారు.
కొత్త జిల్లాలు దీక్షలతో ఏర్పడవు
దీక్షలు, ధర్నాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు కావని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ధర్నాలు, నిరాహార దీక్షల వల్ల కొత్త జిల్లాలు ఏర్పడబోవన్నారు. ప్రస్తుతం చట్టప్రకారమే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకపూర్వమే ఉద్యమ సమయంలో కొత్త జిల్లాల గురించి కె.చంద్రశేఖరరావు ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. పరిపాలనాసౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా నోటిఫికేషన్ వెలువడిందన్నారు. అఖిలపక్ష సమావేశంలో కూడా చర్చించామని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గుతుందే తప్ప, విపక్షాల ఉద్యమాలకు తలొగ్గదన్నారు.