తెలంగాణ

ఎన్టీపీసీలో ఇసుక మాఫియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కొందరు కాంట్రాక్టర్లు ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారు. దొంగలు... దొంగలు... ఊళ్లు పంచుకున్నట్లుగా ఇక్కడ ఇసుకను అందరూ దోచుకుపోతున్నారు. అడిగేవాళ్లు... నిలదీసేవాళ్లు... లేకపోవడంతో ఎన్టీపీసీలోని కొందరు దొంగలు ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో... రామగుండం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇంటి పక్కనే... ఇసుక అక్రమ దందా కొనసాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీపీసీ తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం కాంట్రాక్టు పొందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల అండదండలతో వందలాది ట్రాక్టర్ల ఇసుకను ఇక్కడ నిలువ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంటి నిర్మాణాల పేరుతో రెవెన్యూ అధికారుల నుంచి వేబిల్లులు పొందడం, ఒకే వేబిల్లు పేరుతో వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రశ్నించాల్సిన అధికార యంత్రాంగం ఇట్టే... చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరించడం... అందిన కాడికి దండుకోవడం... ఈ అక్రమ ఇసుక దందాకు కొంత వెన్నుదన్నుగా ఉంటుందని ఇక్కడి జనం బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా... నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు చేసిన సదరు దొంగలపై పిడి యాక్టులు పెట్టాలని ప్రభుత్వం పదే పదే గొంతెత్తి ప్రకటిస్తున్నా అది ఇక్కడ తూచ్‌గా పరిగణించబడుతోంది. ఒక్కటి కాదు... రెండు కాదు... ఏకంగా 300 ట్రాక్టర్ల ఇసుక అక్రమ నిల్వలు ఉన్నా అడ్డుకోవాల్సిన అధికారులు అరికట్టకుండా, చర్యలు తీసుకోకపోవడం ‘వేబిల్లులు’... ముసుగులో దొంగ ఇసుక దందా జోరుగా కొనసాగుతుందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఎవర్నీ ఉపేక్షించం: తహశీల్దార్
రామగుండం తహశీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్లుగా తమ దృష్టికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరు ఈ దందాలో ఉన్నా ఉపేక్షించేది లేదని, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తేల్చి చెప్పారు.