తెలంగాణ

ఆగని ‘జిల్లా’ ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్/కరీంనగర్/వరంగల్, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై పలు జిల్లాలోని బుధవారం ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లా కోసం సిరిసిల్ల పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించారు. సిఎం సిఎం కెసిఆర్ దిస్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా శవయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేట్‌కు తాళాలు వేసి, నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు కొనసాగించారు. చైతన్య రథంపై పాలకుల తీరు ప్రధానంగా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు వ్యతిరేకంగా ఉద్యమ గీతాలు ఆలపిస్తూ మహార్యాలీ కొనసాగించారు. రాజన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో కళానికేతన్ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. కరీంనగర్‌లో రెండవ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ హుస్నాబాద్ పట్టణంలో ఆందోళనలు మిన్నంటాయి. కోరుట్లలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలంటూ గద్వాల కృష్ణవేణి చౌక్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెరాసనేత, మాజీ ఎంపి మంద జగన్నాథంలు సైతం సంఘీభావం ప్రకటించి దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. మరోపక్క దేవరకద్ర నియోజకవర్గంలోని సిసికుంట, మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలంతో పాటు నూతనంగా ఏర్పాటు చేస్తున్న అమరచింత మండలాన్ని వనపర్తిలో కలపడానికి ప్రభుత్వం ముసాయిదాలో పొందుపర్చింది. అయితే ఆ మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలంటూ మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసి చైర్‌పర్సన్ రాధ ఆమర్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో హన్మకొండలో ఆందోళన సర్దుమణిగినప్పటికీ జనగామ జిల్లా ఏర్పాటు ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ రఘునాథపల్లి మండలంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, తాటికొండ రాజయ్య చేరుకొని సంఘీభావం తెలిపారు. మరోవైపు చేర్యాలలో జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ భారీ బహిరంగ సభలో తీర్మానించారు. ములుగు జిల్లా ఉద్యమం క్రమంగా తగ్గుముఖం పట్టింది.