తెలంగాణ

అక్షరవల్లి.. వీర్నపల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 7: అది మారుమూల పల్లె.. నాగరికత.. అక్షరాస్యతకు దూరంగా ఉన్న గ్రామం.. విప్లవాలకు పురుడు పోసిన పల్లె.. ఇదంతా గతం.. ప్రస్తుతం సరస్వతి నిలయమైంది.. పల్లె నిండా చైతన్యం వెల్లివిరిసింది.. ఆయుధాలు పట్టిన చేతులే.. అక్షరాలు దిద్దాయి.. అమరవీరుల సాక్షిగా వంద శాతం అక్షరాస్యత సాధించింది.. అ, ఆలు దిద్దలేని ఆ గ్రామం నేడు దేశానికే ఆదర్శమైంది.. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది.. ఎంతో మంది చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఆ పల్లె కీర్తిపతాకాన నిలిపింది.. అక్షరం దిద్ది సాక్షర జెండాను ఎగురవేసింది.. నాగరికతకు దూరంగా.. ఆధునిక వసతులు లేకపోయిన ఆ పల్లెలో వెల్లివిరిసిన చైతన్యమే యావద్దేశాన్ని ఆకర్షించేలా చేసింది.. వీర్నపల్లి కీర్తి కీరిటంలో మరో కలికితురాయి చేరింది.. దేశానికే ఆదర్శంగా నిలిచింది అక్షరవల్లి.. వీర్నపల్లి.. గురువారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామం ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనుంది.
ఇలా వేశారు.. అక్షర‘ బీజాలు’..!
పల్లెల ప్రగతే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే ఆకాంక్షతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంతో పాటు గిరిజన తండాల్లో పర్యటించి అక్షరజ్ఞానం లేకపోతే భవిష్యత్తు అంధకారమవుతోందని ప్రజల్లో చైత్యనం తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామైక్య సంఘాలతో సమావేశమై మూడు శాఖలను సమన్వయపరిచారు. మొత్తం 648 మంది నిరక్షరాస్యులున్నారని తేల్చారు. సంఘాల్లో చదువుకున్న వారిని ఎంపిక చేశారు. ప్రతిఒక్కరు పదిమందికి అక్షరాలు నేర్పించాలని నిర్ణయించారు. పుస్తకాలు, సామాగ్రిని స్వయంగా అందించారు. ఉపాధి పనులు ముగిసిన అనంతరం అక్కడే అక్షరాలు నేర్పించడం వంటి ప్రణాళికలతో ముందుకు సాగారు. దుమాల గ్రామంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవరాజు ప్రత్యేకంగా బోధించారు. గ్రామానికి చెందిన రాజేశ్‌బాబు కూలీలకు అల్పహారం అందించారు. చదువుకోకపోతే ఎలా మోసపోతున్నామో కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించారు. నిరక్షరాస్యుల్లో చైతన్యం తీసుకువచ్చారు. వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించారు. ప్రస్తుతం వేలుముద్ర లేని పల్లెగా వీర్నపల్లి వెలుగొందుతోంది.

వీర్నపల్లిలోని సాక్షర భారత్ కేంద్రం వద్ద చదువుపై అవగాహన కల్పిస్తున్న సమన్వయకర్త రాజం..
మహిళలకు చదువు చెబుతున్న గ్రామైఖ్య సంఘం సభ్యురాలు..

వేలిముద్రలు వేయడం లేదు
సర్పంచ్ సంజీవలక్ష్మి
గ్రామంలో చదువుకోనివాళ్లు ఎందరో మోసపోయారని, ఎంపి వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న తర్వాత విద్యతో కలిగే లాభాలను వివరించారని సర్పంచ్ సంజీవలక్ష్మి అన్నారు. అందరి సహకారంతో నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించాం. ప్రస్తుతం తమ ఊరిలో వేలి ముద్రలు వేయడం లేదని ఆమె తెలిపారు.