తెలంగాణ

నష్టాల్లో టిఎస్‌ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉందని, నెలకు 18 కోట్లు నష్టం వాటిల్లుతున్నపప్పటికీ ప్రయాణికులకు మాత్రం మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో కలిసి 24 జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం మెట్రోఎక్‌ప్రెస్ బస్సులను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో నడిచే బస్సులు లాభాలలో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో నడిచే పల్లెవెలుగు సర్వీసులు నష్టాల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే రూ. 350 కోట్లతో 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రాంతాలలో ట్రాఫ్రిక్ జామ్ తలెత్తకుండా, గల్లీ ప్రాంతాలలో కూడా బస్సులు తిరిగే విధంగా 45 కోట్లతో 236 మినీ బస్సులను కొనుగోలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండ అతిపెద్ద వరంగల్ పట్టణంలో మరిన్ని కొత్త బస్సులు నడుపుతామన్నారు.
రాష్ట్రంలో ఉన్న 90 బస్టాండ్‌లో ప్రయాణికులకు వౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. దూరప్రాంతాలలో, పుణ్యక్షేత్రాలకు వెళ్లు రూట్లలో ఎసి బస్సులను నడుపుతామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ధాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపనేని నే్రందర్, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.