తెలంగాణ

మంచిరెడ్డిని అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య వివాదం మరింత పెరిగింది. నియోజకవర్గంలో నువ్వా.. నేనా..? అన్న స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయి. నరుూం కేసులో ఇద్దరు ప్రత్యర్థులు ఇటీవల కాలం నుంచి ఒకరిపై నొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతూ, నరుూంతో లింకులపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా గ్యాంగ్‌స్టర్ నరుూంతో, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి పలు అక్రమ భూ దందాలతో సంబంధం ఉందంటూ బుధవారం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిజిపి అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై సిట్ అధికారులతో విచారణ జరిపించాలని రంగారెడ్డి కోరారు. నరుూం అనుచరుడు శ్రీహరితో కలసి ఆదిభట్లలో మంచిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని రంగారెడ్డి డిజిపికి తెలిపారు. అనంతరం రంగారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నరుూంతో కలసి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేసిన భూదందాలపై ఆధారాలతో సహా డిజిపి అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే నరుూం భూదంతాలు, డంప్‌లు బయటపడతాయన్నారు. స్థానిక పోలీసులను బెదిరిస్తూ ఏడేళ్లుగా అక్రమ దందాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి ఆరోపించారు. వందల కోట్ల ఆస్తులు సంపాదించిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై సిట్ అధికారులచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై డిజిపి అనురాగ్‌శర్మకు పూర్తి ఆధారాలతో వివరించానని చెప్పారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదు, ఆరోపణలపై డిజిపి స్పందిస్తూ, నరుూం కేసును సిట్ విచారిస్తోందని, ఈ వ్యవహారంలో నిందితులెవరో సిట్ తేలుస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా, ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు.

మొహం చాటేశారు: మంచిరెడ్డి
తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమేనన్న మల్‌రెడ్డి రంగారెడ్డి మొహం చాటేశరని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నరుూంతో తనకుగల లింకులు, అక్రమ దందాలపై విచారణకు సవాల్ విసిరిన రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం చౌరస్తా వేదికగా సిద్ధమైన తమ ముందుకు రాకపోగా, డిజిపికి ఫిర్యాదు చేయడం అంటే తనవన్నీ నిరాధార ఆరోపణలేనన్నారు. తనపై డిజిపికి ఫిర్యాదు చేసిన రంగారెడ్డి ఇప్పటికైనా తను చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని, లేనిపక్షంలో కోర్టులో పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

స్నేహ పూర్వకంగా విధులు నిర్వహించండి
పోలీసు అధికారుల సమావేశంలో
ఏపి స్పీకర్ కోడెల పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, మీడియా, అధికారులు, సందర్శకులపట్ల స్నేహపూర్వకంగా విధులు నిర్వర్తించాలని ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలీసులకు సూచించారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ఎపి, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) కె. సత్యనారాయణ రావు, ఎపి డిజిపి నండూరి సాంబశివరావు తదితర అధికారులు పాల్గొన్నారు. కోడెల మాట్లాడుతూ భద్రత ఎంత ముఖ్యమో మర్యాద కూడా అంతే ముఖ్యమని అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఉదయం, సాయంత్రం రెండుపూటలా జరిగే అవకాశం ఉన్నందున పోలీసు సిబ్బంది షిఫ్ట్ విధానంలో పనిచేసేలా చూడాలని ఆయన సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
వివిధ రకాలుగా ఉన్న పాసుల సంఖ్యను తగ్గించాలని పోలీసు అధికారులు కోరగా, కోడెల స్పందిస్తూ తగుచర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. అవసరమైతే పాస్‌లను ఒక రోజుకు కాకుండా నిర్ణీత గడువుకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని స్పీకర్ సూచించారు. కౌన్సిల్ ఆవరణలో సిసిటివీలు సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.