తెలంగాణ

నరుూం కేసులో ఐదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో ఐదుగురు నిందితులు గురువారం హయత్‌నగర్ కోర్టులో లొంగిపోయారు. నరుూం అనుచరులు మరో ఐదుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సుధాకర్, ఏ11, రాపాటి వెంకటేష్‌గౌడ్ (న్యాయవాది) ఏ12 నిందితుడు రాపాటి కరుణాకర్, ఏ13 దోర్నాల శ్రీను, ఏ14 శ్రీ్ధర్ రాజులు కోర్టులో లొంగిపోయారు. అదేవిధంగా అరెస్టయిన మరో ఐదుగురిలో పూత బాలకృష్ణ, మహమ్మద్ ఆఖిల్ పాషా, రాపోలు సుదర్శన్, జూకంటి బుచ్చయ్య, మహమ్మద్ ఖాసీం తదితరులు ఉన్నారు. కాగా నరుూం కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు (సిట్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. సీనియర్ ఐపిఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో నరుూం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నరుూంకు ఆయుధాలు అందజేసిన శ్రీ్ధర్‌గౌడ్, సమీరుద్దీన్‌ను చర్లపల్లి జైలు నుంచి మరో 9రోజులు కస్టడీకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా నరుూం అక్రమ వ్యవహారాలపై నల్గొండ, మెదక్ జిల్లాల్లో గురువారం మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. నరుూం బాధితులు ఎవరైనా నేరుగా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోచ్చని సిట్ అధికారులు పేర్కొన్నారు. .