తెలంగాణ

జిల్లాల విభజన ప్రభావం జిఎస్‌టిపై ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జిల్లాల పునర్ విభజన జిఎస్‌టిపై ఎటువంటి ప్రభావం చూపదని రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. జిఎస్‌టి అమలు కోసం ప్రభుత్వ సిబ్బందికి కంప్యూటర్లపై పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టినట్టు అయన అన్నారు. జిఎస్‌టి అమలు కోసం రాష్ట్రం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఇచ్చిన ఐటీ సాఫ్ట్‌వేర్‌ను యథాధాతథంగా వినియోగించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సదస్సులో అజయ్ మిశ్రా కీలకోపన్యాసం చేశారు. జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలు మరింతగా పురోగతి సాధించడానికి దోహదపడుతాయన్నారు. హైదరాబాద్ జోన్ ఐఆర్‌ఎస్ చీఫ్ కమిషనర్ సంధీప్ భట్నాగర్ మాట్లాడుతూ జిఎస్‌టి అమలు కేవలం పన్నుల కోసం మాత్రమే కాదని, అది దేశ వ్యాపార, వాణిజ్య గమనాన్ని మార్చనుందని అన్నారు. జిఎస్‌టిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయన్నారు.