తెలంగాణ

అధికారపక్షానికీ తప్పని తలనొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల విభజన పలుచోట్ల అధికారపక్ష సభ్యులకు సైతం తలనొప్పిగా మారింది. జనగామ జిల్లాను చేయాలని పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. జనగామలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన సాగుతుండడంతో టిఆర్‌ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది. ఇక ముఖ్యమంత్రి కుమారుడు కె తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లా చేయాలని సిరిసిల్లలో అన్నిపార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. సిరిసిల్లలో ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతుండడంతో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
ప్రధానంగా సిరిసిల్ల, జనగామ, హనుమకొండ వంటి ప్రాంతాల్లో అధికార పక్షం సభ్యులు కొత్త జిల్లాలతో ఇరకాటంలో పడ్డారు. మిగిలిన జిల్లాల్లో కొద్ది పాటి ఆందోళనలు జరుగుతున్నాయి. సిరిసిల్లలో అన్ని పార్టీలు ప్రధానంగా కెటిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడంతో కెటిఆర్ ఇరకాటంలో పడిపోయారు. నియోజకవర్గ ప్రజలకు సర్దిచేప్పే విధంగా లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటైతే ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని కెటిఆర్ నియోజకవర్గ ప్రజలకు గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. శాస్ర్తియంగా, హేతుబద్ధతతో, ప్రమాణాల మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సిరిసిల్లలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. సిరిసిల్లను జిల్లా చేయాలని తనతో పాటు చెన్నమనేని రమేష్ ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన చేసినట్టు, అయితే ప్రభుత్వం తీసుకున్న ప్రమాణాల మేరకు ముసాయిదాలో సిరిసిల్ల లేదని చెప్పారు. కొత్త జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు కుమారుడికో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లుడికో జిల్లా అంటూ విమర్శలు చేశారని అన్నారు. సిరిసిల్ల ప్రజలకు తనకు మధ్య అగాధం సృష్టించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.