తెలంగాణ

మూడు పార్టీలకు సర్పంచ్ పదవులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 8: ఖమ్మం జిల్లాలో తొలిసారి ఈవిఎంల ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మూడు స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలో గురువారం మూడు సర్పంచ్ స్థానాలకు, ఏడు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలకు, 24 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వుండగా కల్లూరు మండలంలోని పెద్దకోరుకొండి గ్రామ సర్పంచ్‌తో పాటు మరో 17 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో మూడు సర్పంచ్, ఏడు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. కాగా మద్దులపల్లి ఎంపిటిసి స్థానానికి శుక్రవారం ఎన్నిక జరగనుంది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన రాఘ ఎల్లమ్మ 27 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించింది. మండల కేంద్రం చింతకాని గ్రామ సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా పోరాడినా దివంగత టిడిపి సర్పంచ్ గొల్లమందల బాబు భార్య గొల్లమందల మంగమ్మ టిడిపి తరపున పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు. టేకులపల్లి మండలం బద్దుతండ సర్పంచ్ పదవిని టిఆర్‌ఎస్ అభ్యర్థి తొళెం సృజన దక్కించుకున్నారు. ఇక్కడ బలంగా ఉన్న న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయి పోటీ చేయడంతో టిఆర్‌ఎస్ విజయం సులువైంది. ఇక్కడ పోలైన ఓట్లలో టిఆర్‌ఎస్‌కు 592, రాయన్న వర్గానికి 474, చంద్రన్న వర్గానికి 343, కాంగ్రెస్ అభ్యర్థికి 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థి కంటే న్యూడెమోక్రసీ రెండు వర్గాలకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలావుండగా చండ్రుగొండ మండలం పెంట్ల 2వ వార్డులో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ తీశారు. లాటరీలో విజయం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది.