రాష్ట్రీయం

పెట్టుబడులే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ మరింత ఉత్సాహంతో ఈసారి అంతర్జాతీయ వేదికపై కీర్తిపతాక ఎగరేసేందుకు సంసిద్ధమైంది. సిఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధి బృందం దావోస్ బయలుదేరివెళ్తోంది. అక్కడ ప్రపంచ ఆర్ధిక వేదిక 46వ సదస్సులో ప్రతినిధి బృందం పాల్గొని సన్‌రైజ్ ఆంధ్రకు పెట్టుబడులు ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనుంది. బ్రాండ్ ఏపీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి సిఎం చంద్రబాబు చేస్తున్న విదేశీయాత్రల్లో దావోస్ పర్యటన కీలకంకానుంది. ఈనెల 20 నుంచి 23 వరకూ దావోస్ సదస్సులో సిఎం పాల్గొంటారు. నాలుగో పారిశ్రామిక విప్లవం అనే భావనతో జరిగే సదస్సులో ప్రపంచ దేశాల మంత్రులు, విఖ్యాత సంస్థల అధిపతులు పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం సచివాలయంలో చెప్పారు. సిఎం చంద్రబాబును డబ్లుఇఎఫ్ సదస్సునకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు మన దేశం నుండి హాజరవుతున్న ఒకే ఒక సిఎం చంద్రబాబు. సదస్సులో భారత్ నుండి అరుణ్ జైట్లీ, రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ పాల్గొంటారు. దీనిదృష్ట్యా దావోస్ సదస్సులో ఏపీ సిఎం ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. ఇది రాష్ట్రానికి ఎంతగానో మేలు చేయబోతోందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.
రక్షణ, వైమానిక, విద్యుత్, ఇంధన, ఆతిథ్య, వైద్యపరికరాల తయారీ, వౌలిక సదుపాయాల కల్పన, బహుళార్ధ ఆర్ధిక సంస్థలు, రవాణా, నౌకాయాన రంగాలు, నౌకాశ్రయ రంగాలు, కన్సల్టింగ్, ఐటి సెక్టార్లలో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో సిఎం ముఖాముఖి సమావేశాలు జరిపే అవకాశం ఉంది. డబ్ల్యుఈఎఫ్ -2016 వార్షిక సదస్సులో సిఎం పలు కీలక సమావేశాల చర్చల్లో పాల్గొంటారు. పట్టణాభివృద్ధి సర్వీసులు- భవిష్యత్ అంశంపై స్టీరింగ్ కమిటీ సమావేశం, వ్యాపారానికి సరికొత్త వాతావరణం, భారత్ -ప్రపంచం, వౌలిక సదపాయాలు- పట్టణాభివృద్ధికి ఇండస్ట్రీ గవర్నర్ల విధాన నిర్ణాయక సంఘ సమావేశం, వ్యవసాయం సరికొత్త దృష్టి- ముందస్తు కార్యాచరణ ప్రణాళిక, ఇంధన రంగంలో కొత్త రూపు రేఖలు, ఉత్పాదక రంగం - భవిష్యత్ అంశాలపై సిఎం కీలక ప్రసంగాలు చేయనున్నారు. జనరల్ మోటార్సు సిఇఓ మేరీ బర్రా, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫిడరేషన్ సెక్రటరీ జనరల్ షరోన్ బరో, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల, హిటాచీ చైర్మన్ హిరోయకి నకానిషి, క్రెడిట్ సూస్సీ, అల్ బాస్లా అండ్ గ్లోబల్ షేవర్ ఆఫ్ టునిష హబ్ అమీరా యాహోయోయి సదస్సునకు కో చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.
సిఎం పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య దిగ్గజాలు, వివిధ రంగాల్లో నిపుణులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నెస్లే, జాన్సన్ కంట్రోల్స్, ట్రినా సోలార్స్, సీమెన్స్, మెకనే్స, లాక్‌సీడ్ మార్టిన్, అక్కియోనా ఎనర్జీ, స్పెయిన్ , జెట్రో-ఊబర్, హాన్యాక్యుసెల్స్, ఫిలిప్స్, అంటీవెర్ప్ పోర్టు అథారిటీ, స్విస్ రీ, రోనాల్డ్ బెర్గర్, హ్యులెట్- ప్యాకర్డ్, ఎంటర్‌ప్రైజ్ పియుఎస్ ఫౌండేషన్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్టుమెంట్ బ్యాంకు, మారియట్ ఇంటర్నేషనల్, మెడ్‌ట్రోనిక్, సేల్స్ ఫోర్సు అండ్ ఇంటర్ కంటినెంటల్ హోటల్స్ ప్రతినిధులతో సిఎం సమావేశమవుతారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్‌తోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్‌వంటి వారితో సిఎం సమావేశమవుతారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రధానాంశంగా నిర్వహించే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఈ అంశంపై మరింత పరిజ్ఞానం సాధించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బాట వేయడమే పర్యటన ఉద్దేశమని పరకాల ప్రభాకర్ అన్నారు. కొత్త సామర్ధ్యాలను వెలికితీసి, రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేయడంలో నాలుగో పారిశ్రామిక విప్లవం దోహదపడుతుందన్నారు.