తెలంగాణ

46కోట్ల మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అటవీ, పర్యావరణం,బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గచ్చిబౌలిలోని ఎన్విరాన్‌మెంట్ ప్రొటక్షన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను మంత్రి సందర్శించారు. రిసెర్చ్ లాబరేటరీని పరిశీలించి పర్యావరణంపై కాలేజీ వి ద్యార్థులతో మాట్లాడారు. ఈపిటిఆర్‌ఐ ప్రాంగణంలో ఔషధ మొక్కలను నాటారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రం లో ప్రస్తుతం 23 శాతం గ్రీనరీ ఉందని, దీనిని 33శాతానికి పెంచడమే లక్ష్యంగా హరిత హారం చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 30 కోట్ల మొక్కలు నాటామని, ఈ ఏడాదిలో 46 కోట్ల మొక్కలను నాటనున్నట్టు చెప్పారు. ఈపిటిఆర్‌ఐ కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి ఈపీటిఆర్‌ఐని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిఎస్‌పిఎస్సీ సభ్యులు సి విఠల్, ఈపిటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ బి కళ్యాణ చక్రవర్తి, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు కొలన్ ప్రదీప్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ పద్మాచారి, విజయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.