తెలంగాణ

ఎన్టీపీసీ ఇసుక మాఫియాపై రెవెన్యూ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 8: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న ఇసుక మాఫియాకు చెక్ పడింది. ఇంటి నిర్మాణాల పేరుతో వేబిల్లులు పొందడం... వాటిపై ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ వ్యవహారం బయటపడింది.
అక్రమ ఇసుక దందాపై... ‘ఎన్టీపీసీలో ఇసుక మాఫియా’ శీర్షికతో ‘ఆంధ్రభూమి’, ‘దక్కన్ క్రానికల్’ దినపత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా రెవెన్యూ ఉన్నత యంత్రాంగం రంగంలోకి దిగిం ది. గురువారం పెద్దపల్లి ఆర్డీఓ అశో క్ కుమార్ ఆదేశాలతో రామగుండం తహశీల్దార్ జి.శ్రీనివాసరావు ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లపై దాడులు చేపట్టారు. లక్షలాది రూపాయల విలువ జేసే 200 ట్రాక్టర్ల పైచిలుకు ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక దాదాపు 2 లక్షల రూపాయల విలువ ఉంటుందని తహశీల్దార్ గుడూరి శ్రీనివాసరావు తెలిపారు. బాధ్యులు ఎంతటి వారైనా ఊరుకునేది లేదని, క్రిమినల్ కేసులతోపాటు అవసరమైతే పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాగా, అక్రమంగా ఇసుక నిల్వలు చేసిన ఓ బడా కాంట్రాక్టర్ ఈ వ్యవహారం నుం చి బయట పడేందుకు నేతలతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. సీజ్ చేసిన ఇసుక డంప్‌ను మైనింగ్ అధికారులకు అప్పగించి వేలం వేయనున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్ ప్రాంతంలో కొంత మంది కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో అక్రమంగా ఇసుక నిల్వలు ఉంచినట్టు తమ దృష్టికి సమాచారం వస్తోందని, వీటిని కూడా పసిగట్టి దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఖాజా,విఆర్‌ఓ అజీంతోపాటు పలువురు ఉన్నారు.

చిత్రం.. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని అక్రమ ఇసుక డంప్‌ను సీజ్ చేస్తున్న రెవెన్యూ అధికారులు