తెలంగాణ

కాకతీయ.. భద్రకాళి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: గద్వాల, జనగామ జిల్లాలను ఏర్పాటు చేసే యోచన లేదని సిఎం కె చంద్రశేఖర్‌రావు పరోక్షంగా స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపాదించిన మూడు జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం స్పష్టం చేయడంతో గద్వాల జిల్లా ప్రతిపాదన లేనట్టేనని పరోక్షంగా స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో ప్రతిపాదించిన నాలుగు జిల్లాలు యథాతథంగా ఉంటాయని, అయితే నాల్గవ జిల్లాగా ప్రతిపాదించిన హన్మకొండకు బదులు మరో జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలో స్థానం లభించని గద్వాల, జనగామ జిల్లాల డిమాండ్లపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టత ఇచ్చేందుకు శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వరంగల్‌కు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డితోపాటు ఎంపీలు వినోద్‌కుమార్, ఎంపి జితేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో కలుస్తున్నాయని, మిగిలిన మండలాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మిగిలిన వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్టు సిఎం వివరించారు. ఈ రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. భౌగోళికంగా పెద్దదైన మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెబుతూ గద్వాల జిల్లా డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతుందని, జిల్లా అంతటికీ నీటి సౌకర్యం కలుగబోతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్టు సిఎం హామీ ఇచ్చారు. నీటిపారుదల రంగంలో మహబూబ్‌నగర్ జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలువబోతుందన్నారు. జిల్లానుంచి వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చే రోజులు రాబోతున్నాయన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూరె్తై నీటి విడుదలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో దాదాపు 5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మించేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. హెల్త్, ట్రైబల్ యూనివర్సిటీలతోపాటు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
ఇంకొన్ని కొత్త మండలాలకు గ్రీన్ సిగ్నల్
మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించాలన్న ప్రతిపాదనను పరిశీలించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్ణీర్ణంలో చాలా పెద్దది కావడంతో దీన్నికూడా రెండు మండలాలుగా విభజించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలాన్ని సమీపంలోని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సిఎం ఆదేశించారు. వరంగల్ జిల్లా తొర్రూరును రెవిన్యూ డివిజన్‌గా మార్చి దీనిలో కొడకండ్ల మండలాన్ని చేర్చాల్సిందిగా సిఎం ఆదేశించారు. అలాగే వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్దవంగర, కొమురవల్లి మండలాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని సిఎం అన్నారు. దేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటికంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.