తెలంగాణ

బిరబిరా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలు గ్రామాలకు చేరుతుండటంతో ప్రజలలో ఆనందం నెలకొంది. పైనుంచి కాలువల ద్వారా వస్తున్న నీటిని జొన్నలబొగుడ రెండో లిప్టులోని మొదటి పంపుతో నీటిని పంపింగ్ చేస్తూ జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపి కాలువల ద్వారా కిందికి వదులుతున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నాలుగువేల ఎకరాలకు, సింగోటం రిజర్వాయర్ నుంచి 11వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. జొన్నలబొగుడ రిజర్వాయర్‌లో 2.14 టిఎంసిల నీటిని నిలువ ఉంచుతూ 55 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఇంకా పూర్తిస్థాయిలో కాలువల పనులు పూర్తికాకపోవడంతో ఈ యేడాది 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి 2.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నేటికి 29వ ప్యాకేజి పనులు నామమాత్రంగానే జరిగాయి. 30వ ప్యాకేజీ ద్వారా ప్రధాన కాలువల పనులు జరిగినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం 40వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గుడిపల్లి రిజర్వాయర్ నుంచి 29వ ప్యాకేజిలోని ప్రధాన కాలువలకు నీరు వదులుతుండటంతో ప్రధాన కాలువల ద్వారా నీరు పారుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.