తెలంగాణ

ఆత్మగౌరవానికి ప్రతీక కాళోజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరబాద్, సెప్టెంబర్ 9: వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ తరానికి అన్యాయం జరిగినా ముందు నిలిచి పోరాడిన ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గీతాంజలి కావ్యాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్‌ను విశ్వకవిగా ప్రశంసించారని, అలాగే విశ్వ కవి కాళోజి అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి రవీంద్రభారతిలో జరిగిన కాళోజి నారాయణ రావు 102వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగిస్తూ కాళోజి ఆశయంతో ప్రజాకవి గోరటి వెంకన్న తెలంగాణ ప్రజలను ఏకం చేయడానికి పాటలు రాశారని తెలిపారు. వెంకన్నను సత్కరించి ఒక లక్షా వెయ్యి నూట పదహారు రూపాయలతో కాళోజి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ కాళోజి జయంతిని అధికారికంగా జరుపుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. కాళోజి కళాక్షేత్రానికి ఐదెకరాల స్థలం కేటాయించామని, రూ. 60 కోట్ల నిధులు సమకూర్చామని చెప్పారు. కేంద్రం పదిహేను కోట్లు ఇవ్వడానికి అంగీకరించిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లు విడుదల చేసిందన్నారు. పాటలతో ప్రజల్ని మేల్కొలిపిన గోరటి వెంకన్నకు డాక్టరేట్ ప్రదానం చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ వెంకన్న పాటలను క్యాసెట్ల ద్వారా విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చిత్ర దర్శకులు నర్సింగ్‌రావు, మామిడి హరికృష్ణ ప్రసంగించారు.