తెలంగాణ

పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కాన్పూర్ సెంట్రల్- లక్నోల మధ్య బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ స్తంభన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ..మరి కొన్ని రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లింపును చేపట్టింది. ట్రైన్ నెం.15024 యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 12, 19, 26, డిసెంబర్ 3వ, తేదీల్లో రద్దు చేసినట్టు రైల్వే తెలిపింది. అదేవిధంగా చెన్నై సెంట్రల్-లక్నో గోమతిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 13,20,23,27,30, డిసెంబర్ 4, 7వ, తేదీల్లో రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెం. 16094 లక్నో-చెన్నై సెంట్రల్ గోమతి ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 14,17,21,24,28, డిసెంబర్ 1,5 తేదీల్లో రద్దు చేసింది.