తెలంగాణ

రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రైతుల నుంచి భూములు లాక్కునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్భంధం బ్రిటీషు కాలంలో కూడా లేదని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ అసాంకేతికంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ జలాశయం కింద ముంపు బాధితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కోర్టులకు ఇచ్చిన అఫిడవట్‌లో రైతులు కావాలంటే 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేస్తామని చెప్పి, ఆ తర్వాత బలవంతంగా భూములు తీసుకోవడం కోర్టును తప్పుదారి పట్టించడమే అవుతుందని అన్నారు.
ఈ విషయాలపై 12వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు మల్లు రవి తెలిపారు. మరోవైపు వేములగాట్ గ్రామ రైతులు వంద రోజులుగా భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారని, పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారని ఆయన చెప్పారు.