తెలంగాణ

జిల్లాల పునర్విభజనపై హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: జిల్లాల పునర్విభజన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్) దాఖలైంది. జిల్లాల పునర్విభజనకు గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. జిల్లాల పునర్విభజనపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై అభ్యంతరాలు తెలిపారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల పునర్విభజన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదని ఆయన పేర్కొన్నారు. కొత్త మండలాలైనా, జిల్లాలైనా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పరిధిలో ఉంటాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల విషయంలోనూ గవర్నర్‌తో చర్చించిన తర్వాతే రాష్టప్రతి నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. షెడ్యూలు ప్రాంతాల విషయంలో నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాల్సిందిగా ఆయన తన పిల్‌లో హైకోర్టును కోరారు.