తెలంగాణ

మైనింగ్ బ్లాకుల కోసం టిఎస్‌ఎండిసి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వివిధ రకాల మైనింగ్ బ్లాకుల పనులను దక్కించుకునేందుకు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 12న న్యూ ఢిల్లీలోని సెంట్రల్ మైనింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో శాస్ర్తీ భవన్‌లో జరిగే సమావేశానికి టిఎస్‌ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సింగరేణి సిఎండి శ్రీ్ధర్, మైనింగ్ అధికారులు హాజరవుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 100 బ్లాకులను ఆయా రాష్ట్రాల సామర్ధ్యాన్ని బట్టి కేటాయిస్తారు. లైమ్ స్టోన్, బాక్సయిట్, ఐరన్ ఓర్, బేస్ మెటల్ మైనింగ్ బ్లాకులను ఇతర రాష్ట్రాల్లో దక్కించుకునేందుకు టిఎస్‌ఎండిసి ప్రయత్నిస్తోందని చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు.