తెలంగాణ

పుట్ట గతులుండవనే ప్రాజెక్టులకు అడ్డు పడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తర తరాలుగా నిర్లక్ష్యానికి గురైన మహబూబ్‌నగర్ జిల్లాలో పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచి పంట భూములు పాడై జనం కంట కన్నీరుకు కారణం సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, టిడిపిలేనని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డికె అరుణ, రేవంత్‌రెడ్డి, టిడిపి నాయకులు రేవంత్‌రెడ్డిలు ప్రాజెక్టులపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే అజెండాగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నిర్లక్ష్యానికి గురైన కల్వకుర్తిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినట్టు చెప్పారు. గత పదేళ్లలో కల్వకుర్తి ఎత్తి పోతల పథకం పనులు 50 పూర్తి చేస్తే రెండేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం 45 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి డికె అరుణ పాలమూరు ప్రాజెక్టులను ఏనాడూ పట్టించుకోలేదని, జిల్లాలోని ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదని అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మల్లన్నసాగర్ పై మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.