తెలంగాణ

కార్మికులదే ప్రధాన భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ప్రయాణికుల అవసరాలను గుర్తించి తదనుగుణంగా బస్ సర్వీసులను నడిపిస్తూ, ప్రయాణికులకు సేవలందించడంలో కార్మికులు ప్రధాన భూమికను పోషిస్తున్నారని తెలంగాణ ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీబస్టాండ్‌ను సందర్శించిన ఆయన కంటోనె్మంట్ డిపోలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జెఎన్‌ఆర్‌ఎం బస్సులను పరిశీలించారు. సిబ్బంది అందించిన వినతిని స్వీకరించడంతోపాటు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసి అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమన్నారు. రోజుకు రూ. 2కోట్ల నష్టాలతో నడుస్తున్న ఆర్టీసిని అభివృద్ధి దిశగా తీసుకురావాలంటే కార్మికులు మరింత శ్రమించాలని, సంస్థ పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని, కార్పొరేషన్ పేయింగ్ కెపాసిటీని పెంచుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సుల ద్వారా రూ. 500 కోట్లు, సిటీ సర్వీసుల ద్వారా రూ. 450 కోట్లు నష్టం వస్తుందన్నారు. సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఉద్యోగులు, కార్మికులు, అధికారులు కలసి టీం వర్కు చేయాలని సూచించారు. కార్మికులు సంతృప్తిగా జీతాలు పొందాలంటే ప్రయాణికుల ఆదరణ చూరగొనాలని, ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవడానికి ప్రయాణికుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ వారితో సాన్నిహిత్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోనే టిఎస్‌ఆర్టీసిని అగ్రస్థానంలో తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు 1150 కొత్త బస్సులు, 236 మినీ బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. వెయ్యి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉందని, రవాణా సేవలను విస్తృత పరచేందుకు తగు ప్రణాళికలను అమలుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకు ముందు చైర్మన్‌కు కంటోనె్మంట్ డిపో కార్మికులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి సన్మానించారు.

చిత్రం.. జెబిఎస్‌లోని ఓ షాపులో తనిఖీ చేస్తున్న ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ