తెలంగాణ

జిల్లా జైలు నుండి ఇద్దరు ఖైదీల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా జైలు నుండి పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు శుక్రవారం అర్ధరాత్రి తప్పించుకోగా, వారిని కొన్ని గంటల్లోనే పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ మహారాష్టక్రు చెందిన పార్థీ గ్యాంగ్ ముఠాలోని ఇద్దరు యోగేందర్, జితేందర్‌చౌహాన్ శుక్రవారం అర్ధరాత్రి జిల్లా జైలు నుంచి తాడు సహాయంతో గోడ దూకి తప్పించుకుని పారిపోయారు. ఈ సంఘటనపై వెంటనే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేశామన్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి సిఐ ఎడ్ల మహేష్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడి బస్టాం డ్, రైల్వేస్టేషన్‌లో తనిఖీ చేస్తుండగా, పోలీసుల చర్యలను గమనించిన ఆ ఇద్దరు ఖైదీలు పారిపోయేందుకు ప్రయ త్నం చేయగా, అప్రమత్తమైన పోలీసులు అందులో ఒకరిని పట్టుకున్నారని తెలిపారు. మిగిలిన ఖైదీ తప్పించుకొని పారిపోతుండగా అతన్ని కూడా పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గౌరెడ్డిపేట గ్రామ శివారులో పట్టుకున్నామని చెప్పా రు. జైలు నుంచి తప్పించుకున్న ఇద్దరు ఖైదీలను తిరిగి జిల్లా జైలుకు తరలించామని తెలిపారు. కొన్ని గంటల్లోనే ఖైదీలను పట్టుకున్న పోలీసు సిబ్బంది కిరణ్, సతీష్, రవికుమార్, రవిలకు ఎస్పీ జోయల్ డేవిస్ ఈ సందర్భంగా నగదు రివార్డును అందజేసి అభినందించారు. అలాగే పట్టుకునేందుకు సహకరించిన గౌరెడ్డిపేట గ్రామ మాజీ ఉపసర్పంచ్, ఆటో డ్రైవర్లను ఎస్పీ శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్, సిఐ మహేష్ పాల్గొన్నారు.