తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, సెప్టెంబర్10: వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్ హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, కాల్వలతో పాటు పూర్తి కాగా సాగునీరు కూడా రైతుల పొలాలకు వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తామే ప్రాజెక్టులను పూర్తిచేశామని గొప్పలు చెపుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా టిడిపి ప్రభుత్వం మోసం చే స్తోందని, ప్రత్యేక హోదా వచ్చే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రఘు వీరారెడ్డికి స్థానిక పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు నరేందర్ రెడ్డి, పెంటన్న యాదవ్, సాయలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతయ్య, చంద్రశేఖర్ రెడ్డి, తూం రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఏపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డికి స్వాగతం పలుకుతున్న కొత్తకోట కాంగ్రెస్ నేతలు