తెలంగాణ

జిల్లా సాధన కోసం కొనసాగుతున్న నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 10: జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన కోసం కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా శనివారం జెఎసి నేతృత్వంలో అఖిలపక్షం నాయకులు చెవిలో పువ్వులను పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఎదుట వౌనదీక్ష చేపట్టి నిరసన కొనసాగించారు.
అలాగే సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు వీర్నపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. హుస్నాబాద్, కోహడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని కోరుతూ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో చేపట్టిన దీక్ష శనివారం నాటికి 15 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుద్రంగిని మండలంగా ప్రకటించాలని కోరుతూ టిఅర్‌ఎస్ నాయకులు ఎర్రం నర్సయ్య చేపట్టిన నిరాహార దీక్ష శనివారంతో 17వ రోజుకు చేరింది. ఆటో, కారు సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. వీటితోపాటు రాజన్న జిల్లా కోసం వేములవాడలో, రెవెన్యూ డివిజన్ కోసం కోరుట్లలో, జిల్లా కోసం హుజురాబాద్‌లో వివిధ రకాల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.