తెలంగాణ

శరవేగంగా యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 10: నల్లగొం డ జిల్లా పరిధిలోని యాదాద్రి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. భారీ యంత్రాలతో కూ ల్చివేతలతో పనులు శరవేగంగా సా గు తున్నాయ. యాదాద్రి ఆలయా న్ని తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుతామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే పదిసార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులనుపై నిరంతర దృష్టి పెట్టారు.
యాదాద్రి అభివృద్ధి పనులకు ప్రభుత్వం 300కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఒకవైపు కూల్చివేత పనులు సాగిస్తూనే మరోవైపు నూతన డిజైన్లను అనుసరించి నిర్మాణాలు చేపట్టారు. నాలుగు దిశల రాజగోపురాల నిర్మాణ పనులు, రక్షణ గోడ పనులు మొదలయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచనల మేరకు ఆగమశాస్త్రానుసా రం స్థపతుల పర్యవేక్షణలో ఆలయ అభివృద్ది పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే గుట్టపైన పాత నిర్మాణాలన్ని కూల్చివేయగా స్వామివారు వెలిసిన గర్భగుడి గుహను అలాగే ఉంచారు. ప్రధాన ఆలయాన్ని మూడు నెలల క్రితమే మూసివేసి తాత్కాలిక బాల ఆలయంలో స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో ప్రధాన ఆలయం నిర్మించనుండగా రక్షణ గోడ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయ మహా గోపురాల కూల్చివేత పనులు ప్రారంభించారు.
ఆలయానికి రాకపోకలు సాగించే రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా విస్తరిస్తుండగా పనులు అరవై శాతం దాటాయి. గిరి ప్రదక్షిణ దారిని నాలుగులైన్లుగా విస్తరించే పనులను సైతం చేపట్టారు. గుట్టపైన 14.2ఎకరాలు అందుబాటులో ఉండ గా రెండున్నర ఎకరాల్లో ప్రధాన ఆలయం నిర్మించనుండగా 15వేల మంది కూర్చునేలా కల్యాణ మండపం నిర్మించనున్నారు. గాలిగోపురాలు, ఆలయ ప్రాకార కుండ్యాలు, మాఢ వీధులు, దివ్య విమాన గోపురాలు, వేద పాఠశాల, అభయారణ్యాలు, సంస్కృత పాఠశాల, నవగిరుల అభివృద్ధి, పుష్కరణి అభివృద్ధి, అతిధి గృహాలు, భక్తులకు కాటేజీలు వంటి వసతులను ఆలయ విస్తరణలో భాగంగా నిర్మించనున్నారు. 2017దసరా నాటికి యాదాద్రి అభివృద్ధి పనులను తుది దశకు చేరుతాయని అర్కిటెక్ట్‌లు, స్థపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గుట్టపైకి కిందకు వేర్వేరు ఘాట్ రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. పెద్దగుట్టపై కూడా నూతన నిర్మాణాలకు స్థలాలను చదును చే స్తూ రోడ్లు వేస్తున్నారు. భక్తుల వసతుల కల్పనకు క్యూలైన్లు, వెయిటింగ్ హాల్స్, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, విఐపి కాటేజీలు, లాకర్లు, టికెటింగ్, ప్రసాద విక్రయశాల, ఈవో కార్యాలయం, సెక్యూరిటీ చెక్‌పాయింట్, పోలీస్, అగ్నిమాపక శాఖ, అవుట్ పోస్టులు, వ్రతమండపాలు నిర్మించేలా ఆర్కిటెక్ట్‌లు ఆనందసాయి, ప్రవీణ్‌లు మ్యాపులు రూపొందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సదరు డిజైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి.
850ఎకరాల్లో టెంపుల్ సిటీ
యాదాద్రి అభివృద్ధిలో ప్రధానంగా 850ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం చేయనుండగా సంబంధిత డిజైన్ల మేరకు 250ఎకరాల్లో చేపట్టాల్సిన పనులకు సీఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకృతి రమణీయత, శిల్పకళావైభవం, ఆధ్యాత్మిక చింతన చాటేలా ఆలయ విస్తరణ పనులు కొనసాగించాలని ఆదేశించారు. టెం పుల్ సిటీ ఫ్లాన్‌లో 86ఎకరాల్లో 200కాటేజీలు, మూడున్నర ఎకరాల్లో ఫుడ్ కోర్టులు, ఏడెకరాల్లో మంచినీరు, డ్రైనేజీ సిస్టమ్, 12ఎకరాల్లో పచ్చదనం, 26కరాల్లో ఉద్యానవనాలు, 68ఎకరాల్లో రహదారులు, 42 ఎకరాల్లో గుట్ట పరిసరాలను ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్ధాలని ఆదేశించారు. కాటేజీ నిర్మాణాలకు జెన్‌కో, సింగరేణిలు ముందుకు రావడంతో వాటి నిర్మాణాలకు వేయి, పదిహేనువందల గజాల ఫ్లాట్లను సిద్ధం చేయనున్నారు.
కాగా యాదాద్రి పాత ఆలయ కట్టడాలను కూల్చివేసి నూతన డిజైన్లతో కొత్త నిర్మాణాలు ఆరంభించడంతో రాబోయే రోజుల్లో ఆలయ నూతన రూపును విశే్లషించుకుంటూ సీఎం కెసిఆర్ సంకల్పంతో యాదాద్రి దివ్యక్షేత్రంగా అభివృద్ధి చెందనుండటం ప ట్ల హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం.. యాదాద్రి ఆలయ ఉత్తర గోపురం కూల్చివేత పనులు జరుగుతున్న దృశ్యం..