తెలంగాణ

కురిసింది వాన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాజధాని నగరంలో ఆదివారం మధ్యాహ్నాం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి వల్ల తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేటలో భారీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతంగా 116 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెక్ డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ముసురు పట్టింది. గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. ముసురుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ముసురుతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్‌లో భారీ వర్షానికి ఒకరు మృతి చెందారు. పలుచోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు కూలాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో వరద నీటికి డ్రైనేజీలో పడి పవన్‌కుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. నిజామాబాద్‌లో ఒక మోస్తారుగా, నల్లగొండ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 26.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీనదికి వరద ఉధృతి పెరిగింది. మరో రెండు రోజుల పాటు ఇదేవిధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.