తెలంగాణ

టి.సిఎం క్యాంప్ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంత రెడ్డి అనే కానిస్టేబుల్ ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌సలోని తుకారాంగేట్‌లో నివాసం ఉండే కానిస్టేబుల్ హనుమంత్‌రెడ్డి (30) నార్త్‌జోన్ డిసిపి కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులకు వ్యతిరేకంగా డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించలేక చాలా కాలం సెలవు పెట్టాడు. దీంతో ఇతనికి రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఆగిపోయాయి. వీటికి తోడు ఇటీవల డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన మెస్సేజ్‌ను ఇతర గ్రూప్‌లకు ఫార్వార్డ్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశంతో విచారణ చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు హనుమంతరెడ్డి సెల్‌ఫోన్‌ను పరిశీలించి వెళ్లినట్టు సమాచారం. పోలీస్ ఉన్నతాధికారులపై వాట్సాప్‌లో పోస్ట్ చేసింది.. తానేనని.. తనపైనే ఈ కేసు వస్తుందని తీవ్ర మనస్థాపానికి గురైన హనుమంత్‌రెడ్డి ఆదివారం ఫినాయిల్ కలిపిన కిరోసిన్‌ను తీసుకొని సిఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. సమీపంలోని ఫ్లైఓవర్‌పై నిలుచొని దానిని సేవించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న హనుమంతరెడ్డిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా కానిస్టేబుల్ హనుమంతరెడ్డి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత విషయాలతోనే కానిస్టేబుల్ ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నార్త్‌జోన్ పోలీసులు తెలిపారు.