తెలంగాణ

మల్లన్నసాగర్‌పై పోరు ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద ఆదివారం ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ అన్ని విధాలా సాంకేతికంగా అవకాశం ఉన్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును పక్కన పెట్టి రీ-డిజైన్ పేరిట కాళేశ్వరం కొత్త ప్రాజెక్టును చేపట్టి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ వద్ద చిన్న సంప్ హౌజ్ నిర్మాణం జరిపితే సరిపోతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నా కూడా వినిపించుకోకుండా 50 టిఎంసిల రిజర్వాయర్ నిర్మించాలనుకుని రైతులను ముంచుతున్నారని ఆయన విమర్శించారు. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలకు దిగితే పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆయన తెలిపారు. 2013 చట్టం ప్రకారం భూములు లేని పేదలకు, వృత్తిదారులకు చేయాల్సిన పరిహార పనులను పక్కన పెట్టి ప్రజలకు నష్టం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
అధికారంలోకి రాగానే..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాకంటకంగా మారారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం నిర్బంధించబడిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో లోక్‌తంత్ర లేదని, ఏక్‌తంత్ర నడుస్తున్నదని విమర్శించారు. మల్లన్న సాగర్ సాంకేతికంగా సాధ్యం కాదని అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, లేదంటే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. మర్రి శశిధర్ రెడ్డి ప్రసంగిస్తూ మంత్రి టి. హరీష్ రావుకు దమ్ముంటే మల్లన్న సాగర్‌పై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
మంత్రి హరీశ్‌ను చూస్తుంటే బాధ కలుగుతున్నదని అన్నారు. మిషన్ కాకతీయ మొత్తం కుంభకోణంగా మారిందని ఆయన విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి డికె అరుణ, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తదితరులు ప్రసంగించారు.

మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా
ఇందిరా పార్కు వద్ద ఆదివారం ఒక రోజు దీక్ష చేసిన
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి. హాజరైన కాంగ్రెస్ నేతలు