తెలంగాణ

ప్రేమ వేధింపులు ప్రాణం తీశాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, సెప్టెంబర్ 11: ప్రేమ వేధింపులు అభంశుభం తెలియని ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీశాయి. చదువుపై దృష్టిపెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించిన ఆ విద్యార్థిని పై లోకానికి ఎగిసిపోయింది. గ్రామీ ణ నేపథ్యం నుంచి వచ్చిన బాలికను ప్రేమ పేరుతో యువకుడు వేధింపులకు గురిచేయడం, ఈ విషయం గ్రామస్తుల దాకా వెళ్లడంతో ఆ అవమానం భరించలేక విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లి సరోజన, రాజు దంపతుల దత్త పుత్రిక వౌనిక (17) స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇదే గ్రామానికి చెందిన గండికోట మహేష్ అనే యువకుడు ఆకతాయిగా తిరుగుతూ వౌనికను ప్రేమ పేరుతో గత కొద్దికాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఈ విషయమై వౌనిక తల్లిదండ్రుల మహేష్‌ను మందలించారు. పెద్ద మనుషుల వద్ద కూడా పంచాయతీ చేశారు. అయినా మహేష్ పద్దతి మార్చుకోలేదు. రోజూ కళాశాలకు వెళ్లివచ్చే వౌనికను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ వేధింపులను ఎవరికి చెప్పుకోలేక చివరకు ఆదివారం ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రాంపూర్‌లో విషాదం నింపింది. మహిళలను, విద్యార్థినులను వేధింపులనుండి కాపాడేందుకు ప్రభుత్వం కఠిన మైన కొత్త చట్టాలు చేసినా ఇలా వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వౌనిక ఆత్మహత్య వ్యవహారంలో బాధ్యులందరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే తన ఆత్మహత్యకు గల కారణాలను వౌనిక మూడు పేజీల సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. ఎస్సై కోటేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.